యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘జై లవకుశ’ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ బుధవారం వరల్డ్‌వైడ్ రిలీజ్ సందర్భంగా ఒకరోజు ముందే, అంటే ఈరోజు ప్రీమియర్ షోల సందడి నెలకొంది. దేశ, విదేశాల్లో ప్రీమియర్ షో టిక్కెట్ల కోసం తారక్ అభిమానులు ఎగబడ్డారని తెలుస్తోంది. గల్ఫ్ దేశం యుఏయి నుంచి తొలి రివ్యూ అప్పుడే బయటకు వచ్చేసింది. యుఏఈ నుంచి సౌత్ ఇండియన్ సినిమాలపై తొలి రివ్యూను అందించే ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ‘జై లవ కుశ’కు అదిరిపోయే రేటింగ్ ఇవ్వడమే కాకుండా తారక్ నటనను ఆకాశానికెత్తేశాడు.
”ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. జై, లవ, కుశ.. మూడు పాత్రల్లో వేరియేషన్స్ అదరగొట్టేశాడ”`ంటూ ఉమర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ గా నిలుస్తుందని ప్రశంసించాడు. ఎన్టీఆర్ డైలాగులు, దేవి శ్రీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకి అస్సెట్స్. ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి. కథకు అడ్డు తగిలే సన్నివేశాలు… కమర్శియాలిటీ కోసం ఇరికించడం ఇబ్బందిగా అనిపించిందని ఉమర్ సంధు తన రివ్యూలో పేర్కొన్నాడు