Jai Hanuman: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఊహలకు మించి ఘన విజయం సాధించింది.
హనుమాన్ మూవీ 10 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కు దాటి.. ఇంకా జోరు కొనసాగిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తీస్తాను అని డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ మూవీ 2025లో వస్తుందని హనుమాన్ చివర్లోనే మేకర్స్ స్పష్టం చేశారు.
హనుమాన్ అద్భుతంగా ఉండడంతో సీక్వెల్‍పై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ‘జై హనుమాన్’పై దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా అప్డేట్ ఇచ్చాడు. జై హనుమాన్ సినిమా స్క్రిప్ట్ పనులను నేడు మొదలుపెట్టినట్టు ప్రశాంత్ వర్మ తెలిపారు.
‘ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు హనుమాన్‍పై చూపిస్తున్న అమితమైన ప్రేమ, మద్దతు పట్ల కృతజ్ఞతతో.. నేను కొత్త ప్రయాణంతో నిల్చున్నా. శుభప్రదమైన రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజున జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్ మొదలైంది’ అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.
అయితే ఈ సీక్వెల్స్‌లో ఎవరూ హీరోగా నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సీక్వెల్‌లో తేజ హీరో కాదని తెలిపారు. ‘హను-మాన్’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ ఉండబోతోంది.
‘జై హనుమాన్ కథ అంతా హనుమాన్ పాత్రతోనే సాగుతుంది. ఆ పాత్రలో ఎవరని చూపించాలని ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీలో ఓ ఫేస్ చూపించి, సీక్వెల్ లో మరో ఫేస్ చూపిస్తే బాగోదని మొఖాన్ని రివీల్ చేయలేదు. జై హనుమాన్ లో ఆంజనేయ స్వామి పాత్రని టాలీవుడ్ స్టార్ హీరోనే చేస్తారు. ఇక ఈ సీక్వెల్ లో తేజ సజ్జ హనుమంతు పాత్రతోనే సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ‘హను-మాన్’ మూవీలోనే మెగాస్టార్ చిరంజీవి హనుమాన్‌గా కనిపించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజంగా కాలేదు. అప్పడు మిస్ అయింది. ఈ సారి మాత్రం పక్కగా చిరంజీవి ఈ సీక్వెల్స్‌లో హనుమాన్‌గా కనిపిస్తాడు. అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.