HomeTelugu Trendingసూర్య- జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు!

సూర్య- జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు!

Jai bhim issue court orders

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన ‘జై భీమ్‌’ చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్‌ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu