కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఆయన కుమారుడు నిఖిల్ గౌడను హీరోగా
పరిచయం చేస్తూ.. ‘జాగ్వార్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా
స్పెషల్ సాంగ్ కూడా చేసింది. సుమారుగా 75 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న కావడంతో సాధారణంగానే
సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి
ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మైసూర్ కు
చెందిన లోకేశ్ అనే వ్యక్తి దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇటీవల ఈ సినిమా టీం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో టికెట్లను సొంతం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. అందులో భాగంగా అత్యధిక రేట్ పెట్టి లోకేశ్ టికెట్ ను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త హీరో సినిమా మొదటి టికెట్ ఈ రేంజ్ లో అమ్ముడిపోవడం ఆశ్చర్యం కలిగించే
విషయమే.. 16 దేశాల్లో ఈ చిత్రాన్ని 1000 స్క్రీన్ లకు పైగా విడుదల చేస్తున్నారు.