జగపతిబాబు టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పటేల్’. ‘ఎస్.ఐ.ఆర్’ అనేది ట్యాగ్ లైన్. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 30) వారాహి చలనచిత్రం ఆఫీసులో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవం సందర్బంగా సినిమా టీజర్ ను కూడా విడుదల చేయడం విశేషం.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవదర్శకత్వం వహించారు. మరో సంగీత దర్శకులు కళ్యాణ్ కోడూరి కెమెరా స్వీచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “తెలుగు చిత్రసీమలో ఉన్న అద్భుతమైన నటుల్లో జగపతిబాబు ఒకరు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జగపతిబాబు స్టైలిష్ గా కనిపించనున్నారు. టీజర్ ను కూడా నేడు విడుదల చేశాం. ఈ టీజర్ ను మా డైరెక్టర్ వాసు పరిమి రెండు రోజుల్లో తెరకెక్కించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అన్నారు.
ఈ చిత్రానికి రచయిత: సునీల్, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, సంగీతం: డిజే వసంత్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సమర్పణ: సాయిశివాని, నిర్మాత: రజిని కొర్రపాటి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి!