దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. రీల్ లైఫ్ వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. కాగా.. ఇందులో వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. రాజారెడ్డి గెటప్‌లో జగపతిబాబు లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సీరియస్‌గా చూస్తూ దండం పెడుతున్నట్లుగా ఉన్న ఈ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది ఈ ఫోటో.
70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె సంగీతం అందిస్తున్నారు. ఇందులో వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో సుధీర్‌బాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ జర్నలిస్ట్‌గా కన్పించనున్నారట. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.