HomeTelugu Trendingఆసక్తికర టైటిల్‌తో జగపతిబాబు

ఆసక్తికర టైటిల్‌తో జగపతిబాబు

Jagapathi Babu latest movie
టాలీవుడ్‌ సినీయర్‌ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫాదర్- చిట్టి – ఉమ – కార్తీక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమానిఇ లో యువ జంటగా కార్తీక్, తమిళ నటి అమ్ము అభిరామి నటిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 14గా రాబోతున్న ఈ చిత్రంలో బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటిస్తోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని దామోదర్ ప్రసాద్ తెలిపారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 2021 జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు కీలక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu