యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడు. ఈచిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు సమాచారం. డిఫరెంట్ పాత్రలో జగపతిబాబు కనిపించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా వుంటాయని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారు .. కృష్ణంరాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం, ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.