విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు. హీరో ఎవరైనా సరే, అందులో మంచి పాత్ర ఉంటే దర్శక-నిర్మాతలకు మొదటి ప్రాధాన్యం ఆయనే. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో ఉన్నారు. అక్కడి ఐయోవా రాష్ట్రంలో జరిగే స్టేట్ ఫెయిర్‌లో విశేషాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆ ఫెయిర్‌లో ఉంచిన వరల్డ్ సూపర్ బుల్‌తో ఫొటో దిగారు. దాదాపు 2వేల టన్నుల బరువున్న బుల్ పక్కన ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు. ‘ఐయోవా స్టేట్ ఫెయిర్’ను సందర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చూశారా? ఇది 2వేల టన్నుల బరువున్న వరల్డ్ సూపర్ బుల్’. నిజంగా ఇది అద్భుతమైన అనుభూతి’ అని ట్వీట్ చేశారు.
ఐయోవా స్టేట్ ఫెయిర్‌ను ఆ రాష్ట్ర రాజధాని డెస్ మోనిస్లో ఘనంగా నిర్వహిస్తారు. 1886 మొదలైన ఈ ఫెయిర్ ఏటా ఆగస్టు నెల రెండో గురువారం నుంచి 11 రోజుల పాటు దీన్ని చేస్తారు.