Homeపొలిటికల్వాళ్ళ కారణంగా జగన్ బ్యాచ్ కి చావుకొచ్చింది

వాళ్ళ కారణంగా జగన్ బ్యాచ్ కి చావుకొచ్చింది

Jagan

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింద‌నే సామెత చందాన‌… వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి కారణంగా ఇప్పుడు జగన్ బ్యాచ్ కి చావుకొచ్చింది. ఫలానా ఎమ్మెల్యే వెళ్లిపోయేలా ఉన్నాడని జగన్ రెడ్డికి చెబితే.. తన సలహా దారుల పై, తన అనుచరుల పై జగన్ రెడ్డి అంత ఎత్తున విరుచుకుపడుతున్నాడు. ‘నాకే ఎమ్మేల్యేలు ఎదురు తిరుగుతారా ?, అసలు మీరేం పీకుతున్నారు ?’ అనేది జగన్ రెడ్డి ప్రశ్న. వెళ్లిపోయే వాళ్ళు ఏదో ఆశించి భంగపడి వెళ్ళిపోతున్నారు. ఆ భంగపాటుకు కారణం జగన్ రెడ్డే కదా. మళ్లీ మనల్ని తిడుతున్నాడేంటి ? ఇది జగన్ బ్యాచ్ వెర్షన్. అసలేం జరుగుతుంది ? అనేది, జగన్ రెడ్డికి చెప్పడం తప్ప, వినడం నచ్చదు. దాంతో మరేం చేయాలి ? అన్న ప్రశ్న దగ్గరే జగన్ బ్యాచ్ ఆగిపోతుంది. మరోవైపు యువ‌గ‌ళం పేరుతో లోకేష్ పాద‌యాత్ర చేప‌ట్టి 11 రోజులు అవుతుంది. లోకేశ్ పాద‌యాత్ర‌పై టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.

లోకేష్ న‌డుస్తున్న కొద్ది టీడీపీకి గెలుపు ఆశ‌లు పెరుగుతున్నాయి. లోకేశ్ పాద‌యాత్ర వైసీపీకి ఖేదం మిగిల్చుతోంది. అనుకున్న‌దొక‌టి, అయ్యిందొక‌టి అనే రీతిలో జగన్ రెడ్డి పాలన సాగుతుంది అనేది ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయాన్నే లోకేష్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. కానీ, వైసీపీ మీడియా మాత్రం లోకేశ్ పాద‌యాత్ర చ‌ప్ప‌గా సాగుతోంది అంటూ, జ‌నం నుంచి స్పంద‌న క‌రువైంది అంటూ లోకేశ్ ను బ్యాడ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంది. లోకేష్ మొక్కుబ‌డిగా న‌డ‌వ‌డం త‌ప్పితే, ఆయ‌న వెంట తాము వెళ్లాల‌నే ఉత్సాహం చివ‌రికి టీడీపీ శ్రేణుల్లో కూడా క‌నిపించ‌లేదు అంటూ వైసీపీ మీడియా ప్రచారం చేసే పనిలో పడింది. అయినా ఉపయోగం కనిపించడం లేదు.

లోకేశ్ పాద‌యాత్ర‌ ఆల్ మోస్ట్ స‌క్సెస్ దిశగా నడుస్తోంది. ఈ పాదయాత్ర తాలూకు ప్రచారాన్ని త‌మ బాధ్య‌త‌గా ఎల్లో మీడియా భుజానెత్తుకుంది. దాంతో లోకేష్ జనంలోకి చొచ్చుకుపోయేలా ఉన్నాడు. ఇదే ఇప్పుడు జగన్ బ్యాచ్ ని బాధ పెడుతుంది. లోకేశ్ పాద‌యాత్ర‌కు వచ్చిన క్రేజ్ పోవడం ఎట్లా? అనేది ఇప్పుడు నీలి కూలీ మేధావుల‌కు స‌వాల్‌గా మారింది. అందుకే, లోకేశ్ పాద‌యాత్ర‌పై నెగిటివ్ మీమ్స్ క్రియేట్ చేసి రకరకాలుగా ఎంటర్ టైన్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ నీలి కూలీ మేధావులు తమ టాలెంట్ కు పదును పెడుతున్నారు. “వ‌ద్ద‌య్యా సామి. నువ్వు జ‌నంలోకి పోతే, టీడీపీకి ఉన్న ప‌ర‌ప‌తి కూడా పోతుంది. మా మాట విను’ అంటూ లోకేష్ ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంత చేసినా నీలి కూలీ మేధావుల‌ పాచికలు పారడం లేదు. మరోవైపు జగన్ రెడ్డి క‌నీసం జ‌నంలోకి వెళ్ల‌డానికి కూడా భయ పడుతున్నాడు. మొత్తానికి జగన్ రెడ్డి పరిస్థితి అసలేం బాగాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu