Jagan about Vijayawada floods:
ప్రతిపక్షంలో ఉన్నా లేదా ప్రభుత్వంలో ఉన్నా, జగన్ మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. ఆయన ప్రభుత్వ హయాంలో ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, ఆయన ఒక వేదిక వేయించి, రెడ్ కార్పెట్ వేయించి, దానిప నడుస్తూ పరిస్థితులను సమీక్షించేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే పరిస్థితి.
సోమవారం జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో రెండు గంటలు పర్యటించారు. అందులో కూడా ఆయన మీడియా అరగంట మాట్లాడారు కానీ అవి కూడా ట్రోల్ కి గురయ్యాయి. ఆ పర్యటన ముగిసిన వెంటనే జగన్ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు.
ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలియదు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌లు జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకొని ప్రజలతో ఉండటానికి ఇక్కడ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, జగన్ బాధితులకు కనీసం నీటి ప్యాకెట్ కూడా అందించలేదు. ఆయన కేవలం వరద ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
ప్రజలు జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడా లేదా బెంగళూరుకు వెళ్లిపోయాడా లేదా వరదల్లో కొట్టుకెళ్ళిపోయారా అని కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 74 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్రాంతి లేకుండా, కంటిని మూయకుండా కష్టపడుతుండగా జగన్ తీరు ప్రజలకు వినోదంగా మారింది.