Homeతెలుగు వెర్షన్జగన్ రెడ్డి అవినీతి చేసినా.. శిక్ష పడదా ?

జగన్ రెడ్డి అవినీతి చేసినా.. శిక్ష పడదా ?

Pch.. Jagan Reddys debts on Andhra farmers
ఆంధ్ర సీఎం జగన్ రెడ్డి పై అసలు ఎన్ని కేసులు ఉన్నాయో జగన్ రెడ్డికి కూడా తెలియదు, అన్ని కేసులు ఉన్నాయని జోకు ఉంది. నిజానికి జగన్ రెడ్డి పై దేశంలోనే కాకుండా,  విదేశాల్లోనూ కేసులు ఉన్నాయి. మరి, జగన్ రెడ్డి పై ఉన్న కేసులు ఏమవుతాయి ?, ఎప్పటికైనా జగన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉందా ?. సగటు సామాన్యుడి ప్రశ్న ఇది.  ఒక రైతు పై  ఒక చిన్న కేసు పెట్టారని ఆ రైతు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని వినుకొండ తాలూకానే జరిగింది. ఇలాంటివి వెతుక్కుంటే ప్రతి ఊరులో వింటూనే ఉంటాం. మరెందుకు జగన్ రెడ్డి ఎప్పుడు ఏమీ చేసుకోడు ?, ఎందుకంటే.. జగన్ రెడ్డి రాజకీయ నాయకుడు. పైగా ప్రస్తుతం సీఎం కూడా. కాబట్టి కేసులు ఆయనను ఏమీ చేయలేవు. ఈ చట్టాలు అన్నీ కేవలం సామాన్యులకే. 
 
జగన్ రెడ్డి లాంటి వారిని చూసినప్పుడు, వారి నేర చరిత్ర వినప్పుడు కలిగే అభిప్రాయం ఇది. అయినా, మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరికైనా  శిక్ష పడిందా ?, పడినా ఎన్ని రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు ?,  బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రత్యర్థులను అదుపులో ఉంచుకోవడానికి కోర్ట్ కేసులను వాడుకోవడం మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు  ఇక ఎన్ని కేసులు ఉంటే ఏం లాభం ?. మోడీ లాంటి ప్రధాన మంత్రి ఉండి కూడా ఇలాగే ఉంది అంటే.. ఇప్పుడు మోడీని కూడా అనుమానించాల్సి వస్తోంది. 
 
అవినీతి చేసే వారికంటే.. అవినీతి చేసే వారికి అండగా నిలబడటమే అతిపెద్ద అవినీతి అని మోడీ ఎప్పుడు భావిస్తారో !!. సరే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రలో కేసులు అన్నీ జగన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ, ఆయన గారు సీఎం అయ్యాక, ఇప్పుడు ప్రతి పక్షాల చుట్టూ తిరుగుతున్నాయి. సహజమే..  ఒక పార్టీ అధికారంలో వచ్చినపుడు అంతకు ముందు పాలించిన వారిపైన కేసులు నమోదు అవుతాయి. కాకపోతే, ఆంధ్రాలో   తమాషా ఏమిటంటే..  అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు ఎంత పెద్ద అవినీతి కేసులోనైనా క్లీన్ చిట్ వచ్చేస్తుంది. లేక పోతే సంవత్సరాల తరబడి కేసును వాయిదా వేసి చివరికి సాక్ష్యాలు లేవని మూసివేస్తారు. 
 
ప్రస్తుతం జగన్ రెడ్డి కేసుల పరిస్థితి అదే. దీనివల్ల ఎవరికి నష్టం ?, ఆంధ్ర ప్రజలకు కదా. ఆంధ్ర ప్రజలు దేశంలో భాగం కాదా ?, మరెందుకు మోడీ జగన్ రెడ్డి అవినీతి విషయంలో ఇంకా మౌనంగా ఉన్నారు ?, అవినీతి ఎవ్వరు చేసినా ఊరుకోను అంటూ పీఎం అయిన మోడీ.. ఇప్పుడు ఆ అవినీతి పరుల చుట్టే తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తూ ఉండటం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు ఆంధ్ర  రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే..  ఈసారి చంద్రబాబు నాయుడు  కనుక ముఖ్యమంత్రి అవ్వకపోతే, ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించలేరు. 
 
ఆంధ్ర ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం,  రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్లీ గెలవకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే, జగన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు మాయమైపోయాయి. కాబట్టి, భవిష్యత్తులోనైనా  ఆంధ్ర రాష్ట్రం శాంతియుతంగా అభివృద్ధి వైపు పయనించాలంటే..  ఈ రాష్ట్రానికి చంద్రబాబు తప్ప వేరే మార్గమే లేదని ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి అనేది పచ్చ తమ్ముళ్ల ఆరాటం. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం.. జగన్ రెడ్డి లాంటి వారు అవినీతి చేసినా.. వారికీ శిక్ష మాత్రం పడదు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu