YS Sharmila: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన చెల్లి, APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని,నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారటనిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగన్ అన్న కారణంగానే. ఈ రోజు YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నే.
దీనికి సాక్ష్యం దేవుడు…దేనికి! సాక్ష్యం నా తల్లి విజయమ్మ
, నా యావత్ కుటుంబం.జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్నా వైపు నిలబడితే అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు. ఈ రోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం,వాళ్ళను గెలిపించాం.
వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని,పిల్లలకు పక్కన పెట్టీ…ఎండనక, వాన అనక రోడ్ల మీదనే ఉన్న, ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశాను. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా,నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా.
గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు, ఆశయాలు, పేరు నిలబెడతాడు అనుకున్నాను. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలు గా మారారు.
బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే లేడు,ఎంపీ లేడు. అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. జగన్ గారు ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా అనే అంశమే లేదు అన్నారు.