నా వెంట్రుక కూడ పీకలేరంటూ జగన్ రెడ్డి చేసిన సవాల్ కి ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడు ? అంటూ టీడీపీ నాయకులు ఎదురు సవాల్ వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్ని కల దెబ్బకు జగన్ రెడ్డిలో మార్పు వచ్చింది. గత కొన్ని రోజులుగా జగన్ డైలాగుల్లో పస ఉండటం లేదు. పైగా స్పష్టమైన స్పీచ్ కూడా ఉండటం లేదు. జగన్ ఏం మాట్లాడినా.. టీడీపీ – జనసేన కలవడం పాపం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందరూ కలిసి వచ్చినా.. నా వెంట్రుక కూడ పీకలేరు అని చెప్పిన మనిషేనా ఇతను ? అని జగన్ కొత్త మాటలు వింటుంటే అనిపిస్తోంది.
ఆంధ్రాలో ప్రస్తుతం మార్పుల కాలం నడుస్తోంది. ప్రజల్లో మార్పు వచ్చింది, దాంతో జగన్ రెడ్డిలోనూ మార్పు కనిపిస్తోంది.అయినా, టీడీపీ – జనసేన కలవకూడదు అని చెప్పడానికి ఈ జగన్ రెడ్డి ఎవడు ?, పొత్తులనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. పొత్తులు పెట్టుకోవద్దని ఇతర పార్టీల్ని సవాల్ చేయడం అంటే… తమ ఓటమిని తాము ఒప్పుకోవడమే అని జగన్ రెడ్డి గ్రహించలేకపోవడం అతని అసమర్ధతకు నిదర్శనం. అసలు ఇలాంటి చేతగాని వ్యక్తినా ఆంధ్రులు నమ్మింది ?. ఈ విషయంలో ఆంధ్రులు చారిత్రక తప్పిదం చేశారు.
అసలు జగన్ రెడ్డిని సీఎం చేయకుండా ఉండి ఉంటే.. నేడు ఆంధ్ర పరిస్థితి మరోలా ఉండేది. పోనిలే.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనైనా టీడీపీని గెలిపించి.. రాబోయే ఎన్నికల్లో తమ ఆలోచన ఏమిటో ఆంధ్రులు చెప్పినట్టు అయ్యింది. గాలిలో దీపం పెట్టి ఊరుకుంటే సరిపోదు అని ఆంధ్ర ప్రజలు గ్రహించారు. ఒక్కోసారి గాలికి ఉత్త కాగితాలు ఎగరొచ్చు. అంతమాత్రానా ఆ కాగితాలు బలమైనవి అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. జగన్ రెడ్డి విషయంలో జరిగిన పొరపాటు ఈ అమాయకత్వమే.
ఎట్టకేలకు ఆ అమాయకత్వానికి ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఐతే, ఇక్కడ సమిష్టి కృషి అవసరం. టీడీపీ గెలవాలి అంటే.. ఇప్పటి నుంచే కొన్ని మార్పులు చేర్పులు చేయడం మెదలుపెట్టాలి. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం పై ఉన్న ప్రజావ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడానికి టీడీపీ జనాల్లోకి బలమైన మేనిఫెస్టోతో వెళ్ళాలి. అలాగే ఓట్లు పడే జనసేన లాంటి పార్టీలను తమతో కలుపుకుని వెళ్ళాలి. కూటమిగా పోటీ చేయడం వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవు.
మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. మొత్తం వంద ఓట్లు ఉంటే.. యాభై ఒక్క ఓట్లు తెచ్చుకున్న వారికే గెలుపు రాదు. అందుకే పొత్తులు పెట్టుకుంటారు. గెలిచిన వారిలో ఎవరి వైపు ఎక్కువమంది ఉంటే.. వారిదే గెలుపు. అందుకే, జగన్ రెడ్డి పార్టీలకు ఒంటరిగా పోటీకి సవాల్ చేస్తున్నాడు. ఇలా సవాల్ చేయడం అంటే.. జగన్ తన పిరికితనాన్ని ఆహ్వానించినట్టే.