ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పింఛన్ల పెంపు దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తొలి ఏడాది రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించారు. జూన్ 1 నుంచి రూ.2,250 అందజేస్తామని చెప్పారు. రెండో ఏడాది రూ.2,500, మూడో ఏడాది రూ. 2,750, నాలుగో ఏడాది రూ. 3,000 అందజేస్తామన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల హామీలను తప్పకుండా అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. జగన్ తొలి సంతకం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం సీఎం జగన్ అంటూ అభిమానుల
నాదాలతో మారుమోగింది.
అంతకుముందు జగన్ ప్రమాణస్వీకారం ఇందిరిగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు.