
Jabilamma Niku Antha Kopama OTT:
ధనుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘Nilavuku Enmel Ennadi Kobam’ (NEEK) aka ‘జబిలమ్మ నికు అంత కోపమా’ థియేటర్లలో వర్కౌట్ కాలేదు. భారీ అంచనాలతో వచ్చినా, ‘Dragon’ సినిమాతో క్లాష్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయితే, నెగిటివ్ బాక్సాఫీస్ రిజల్ట్ ఉన్నా, OTTలో సక్సెస్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ధనుష్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. NEEK సినిమాను మార్చి 21 నుంచి Prime Videoలో చూడొచ్చు. తమిళం, తెలుగు, మిగతా భాషల డబ్ వెర్షన్లు కూడా అదే రోజున విడుదలయ్యే అవకాశం ఉంది.
#NEEK from March 21st in OTT 🩵
— Itz_Prasanna (@prasanna_dbc) March 3, 2025
ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, పావిష్, మాథ్యూ థామస్ తదితరులు నటించారు. ధనుష్ నిర్మాణ సంస్థ Wunderbar Films ఈ సినిమాను నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ప్రియాంక మోహన్ స్పెషల్ cameo రోల్ చేసింది.
థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, OTTలో కొత్త జీవం పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్ ఫ్యాన్స్ ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Tollywood heroes అడుగుతున్న రెమ్యూనరేషన్ కి అమ్మో అంటున్న నిర్మాతలు