యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది.అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే కాకుండా అనసూయ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో కూడా దూసుకుపోతోంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబీనేషన్‌లో వస్తున్న ఆ సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దానికి తోడు ఇపుడీ భామ లీడ్ రోల్ చేస్తోన్న ‘కథనం’ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఒకవైపు టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతోంది.
అది అలా ఉంటే.. అనసూయ ఈరోజు తన పెళ్లిరోజును జరుపుకుంటోంది. దీంతో తన భర్తతో దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ ‘ఐలవ్‌యూ మై మ్యాన్ అంటూ.. ఇదీ తన తొమ్మిదవ పెళ్లిరోజని..ఈ రోజును ఏమాత్రం వృధా చేయకుండా మనం ఇంకా ఎక్స్ ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది..ఛలో ఛలో అంటూ తన భర్తను ఉద్దేశించి రాసింది.