టాలీవుడ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ద్వారా కృష్ణవంశీకి పరిచయం అయిన శాస్త్రి అక్కడి నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్ర వద్ద శిష్యుడిగా చేరారు. ఆయన పలు సినిమాలకు పనిచేశారు. ఇండస్ట్రీలో వున్న స్టార్ డైరెక్టర్ల చిత్రాలకు తనదైన మార్కు పాటల్నీ అందిస్తూ సినిమా విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు.
ఎప్పుడూ సంప్రదాయకంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి గారు కొత్త లుక్కుతో నెటిజన్లను ఆశ్చర్య పరుస్తున్నారు. నున్నని గుండుతో సూటు వేసుకుని తన వైట్ గోటీకి బ్లాక్ కలర్ వేసుకుని స్టైల్ గా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఏదైనా సినిమా కోసమా లేక ఛేంజ్ కోసమా అనేది తెలియాల్సి వుంది.
From y day s shoot location..
Wroclaw city Poland…fun pic with d Heroine of the film..#HebaPatel
💕💕💕💕💕 pic.twitter.com/feS2KtIrzt— RamajogaiahSastry (@ramjowrites) November 10, 2022