అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది. కెరియర్ పరంగా అల్లరి నరేశ్ కి ఇది 59వ సినిమా. హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా అలరించనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.