HomeTelugu News'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రి-టీజర్ విడుదల

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రి-టీజర్ విడుదల

Allari Naresh Teaser
మారేడుమిల్లి నేపథ్యంలో అల్లరి నరేశ్ హీరోగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు. నరేశ్ సరసన హీరోయిన్‌గా ఆనంది నటిస్తోంది. విభిన్నమైన కథా కథనాలతో నేచురల్‌గా ఉండేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 30న పూర్తి టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ చిత్రం కోసం మారేడు మిల్లిలో 55 రోజుల పాటు షూటింగ్ జరిపారు. 250 మంది అడవుల్లో పనిచేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇంతవరకూ ఎవరూ షూట్ చేయని 22 లొకేషన్లలో ఎంతో కష్టపడి చేసినట్లు తెలిపారు. ఉదయం 3 గంటలకు లేచి కాలినడకన లొకేషన్స్‌కి చేరుకోవడం, చిత్రబృందం పడ్డ కష్టాన్ని ఈ ప్రీ టీజర్‌లో చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu