తమిళ హీరో విజయ్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఏజీఎస్ సినిమాస్ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హీరో విజయ్ ను ఐటీ అధికారులు బుధవారం ప్రశ్నించారు. ప్రస్తుతం మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ ను షూటింగ్ స్పాట్ కు వెళ్లిమరీ అధికారులు ప్రశ్నించారు. దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఏజీఎస్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. చెన్నైలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. ఏజీఎస్ ఎంటర్ టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ తో బిగిల్(తెలుగులో విజిల్) సినిమాను తెరకెక్కించారు. బిగిల్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? ఇతర లావాదేవీలపైన ఐదు గంటలపాటు విజయ్‌ని ఐటీ అధికారులు విచారించారని తెలుస్తుంది. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారట.