HomeTelugu Big Storiesవిజయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలియడం లేదు: జాన్వీ కపైర్‌

విజయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలియడం లేదు: జాన్వీ కపైర్‌

11 16
యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు ఫిమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అర్జున్‌ రెడ్డి’తో ఆయనకు బ్రేక్‌ వచ్చినా.. ‘గీత గోవిందం’ నుంచి అమ్మాయిలు బాగా ఇష్టపడటం మొదలుపెట్టారు. విజయ్‌ సామాజిక సేవ కూడా ఆయన్ను ఇష్టపడటానికి మరో కారణం. కాగా విజయ్‌ అంటే తనకు ఇష్టమని, అభిమాన నటుడని ఇప్పటికే బాలీవుడ్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ చెప్పారు. ఆయన తన క్రష్‌ అని కూడా పేర్కొన్నారు.

జాన్వి తాజాగా నటి నేహా ధుపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి విజయ్‌ గురించి ప్రస్తావించారు. ఆయన తన ఆల్‌ టైమ్‌ క్రష్‌ అని చెప్పారు. ‘దురదృష్టవశాత్తు అటువైపు రియాక్షన్‌ ఏంటో తెలియడం లేదు. నేను ఎక్కువగా ఫీలైపోయి, మాట్లాడిన భావన కలుగుతోంది. కానీ అక్కడి (విజయ్‌) నుంచి స్పందనే లేదు. సరదాగా అన్నానంతే.. విజయ్‌పై నాది కేవలం ఆరాధన భావం మాత్రమే. ఆయన్ను చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు తెలిసి ప్రస్తుతానికి ఇది వన్‌ సైడ్‌ మాత్రమే’.

‘నా అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతుంటాయి. విజయ్‌ చాలా స్థిరంగా ఉన్నాడు. నా అభిమానం కూడా చాలా స్థిరంగా ఉంది. దీని తర్వాత కొన్ని దశలు ఉన్నాయి. ఆ దశల గురించి నేను మాట్లాడలేను, అది తప్పు. ప్రస్తుతానికి విజయ్‌పై నాకున్న ఇష్టం సురక్షితమైన జోన్‌లోనే ఉంది. అందుకే నేను దీని గురించి పబ్లిక్‌గా మాట్లాడుతున్నా’ అంటూ జాన్వి పరోక్షంగా ముచ్చటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu