Homeతెలుగు వెర్షన్అతన్ని దూరం పెట్టడమే టీడీపీకి మంచిది !

అతన్ని దూరం పెట్టడమే టీడీపీకి మంచిది !

It is better for TDP to keep him away

నిల‌క‌డ‌లేని గంటా శ్రీనివాసరావు కోసం త‌మ యువ నాయ‌కులకి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ?, ఇది విశాఖలో టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే గంటా శ్రీనివాసరావుకు రాజ‌కీయాలు గుర్తొస్తాయ‌ని విశాఖ టీడీపీ యువ నాయకుల అనుచ‌రులు మండిప‌డుతున్నారు. పార్టీలో గంటా శ్రీనివాసరావు కొన‌సాగ‌డం వ‌ల్ల టీడీపీలో జోష్ పెరిగింద‌ని ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి గంటా శ్రీనివాసరావు జ‌న‌సేన‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారం ఎప్పటి నుంచో ఉంది. ఆ మధ్య జగన్ రెడ్డి పార్టీలో జాయిన్ కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

కానీ, అంతలో చంద్రబాబు సభలకు జనాలు బారులు తీయడం చూసి.. ఆ వెంటనే గంటా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాడు. ఐతే, గంటా శ్రీనివాసరావుకి టికెట్ ఇవ్వకూడదు అని వైజాగ్ వాసులు కూడా కోరుకోవడమే ఇక్కడ ప్రత్యేకత. టీడీపీ పార్టీ కష్టకాలంలో గంటా ఎన్నడూ పార్టీ వైపు లేడు. పైగా పచ్చి అవకాశవాదిగా గంటా శ్రీనివాసరావు ముద్ర పడ్డారు. దీనికితోడు 2019 త‌ర్వాత అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే గంటా శ్రీనివాసరావు టీడీపీలో క‌నిపిస్తున్నారు. అది కూడా వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నాయకులతో క‌లిసి గంటా శ్రీనివాసరావు క‌నిపిస్తుంటారు.

Ganta Srinivasa Rao

టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువుల‌నే వ్యక్తులతో గంటా చనువుగా ఉండటం తెలుగు తమ్ముళ్లకు అసలు నచ్చడం లేదు. గంటా శ్రీనివాసరావు వ్య‌వ‌హార‌శైలిపై టీడీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్న‌ప్ప‌టికీ, కాపుల ఓట్ల కోసం గంటా శ్రీనివాసరావు ను భ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం బాగా జరిగింది. దీనికి ఓ కారణం ఉంది. అసలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వలస నేతగా గంటా శ్రీనివాసరావుకి ఒక బ్రాండ్ ఉంది. ప్రకాశం జిల్లాలోని కామేపల్లి గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో గంటా శ్రీనివాసరావు జన్మించారు.

ఐతే, బతుకుతెరువు కోసం విశాఖపట్నం వెళ్లి అక్కడ అంచెలంచెలుగా ఎదిగి పలు వ్యాపారాలు చేస్తూ.. విశాఖపట్నం నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గా ఎదిగారు. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్ సభ ఎన్నికల సమయంలో శ్రీనివాసరావు కి అనకాపల్లి లోక్ సభ టికెట్ ఇచ్చారు. దాంతో అనకాపల్లి ఎంపీ గా తొలిసారిగా గంటా గెలుపొందారు.

కానీ 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ఆ తర్వాత పదవి వస్తోంది అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జాయిన్ అయ్యాడు. 2014లో తెలుగుదేశం గెలుస్తోందని, తిరిగి టీడీపీ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే మళ్లీ టీడీపీకి దూరం జరిగాడు. ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకుడ్ని దూరం పెడితేనే టీడీపీకి మంచిది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu