భారతీయ పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్2’ లో చివరి క్షణాల్లో అనుకోని అవాంతరాలు వచ్చన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ ఇస్రో శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు… విక్రమ్ ల్యాండర్ లొకేషన్‌ను గుర్తించారు. నిన్న చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోగా… విక్రమ్ ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌లను ఆర్బిటల్ ల్యాండర్ క్లిక్ చేసింది. అయితే రెండు మూడు రోజుల్లో కమ్యూనికేషన్ జరుపుతామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగ్నల్ వ్యవస్థను రికవరీ చేసే పనిలో పడింది ఇస్రో. సిగ్నల్ రికవరీ అయితే.. చంద్రయాన్ 2లో ఇస్రో అనుకున్న లక్ష్యాలను అందుకోనుంది. దీంతో అంతరీక్షంలో భారత్ తన సత్తా చాటనుంది.