HomeTelugu Trendingపూరీ జగన్నాథ్‌ పై రామ్‌ ప్రసంశలు.. తొలిరోజు కలెక్షన్‌ ఎంతో తెలుసా!

పూరీ జగన్నాథ్‌ పై రామ్‌ ప్రసంశలు.. తొలిరోజు కలెక్షన్‌ ఎంతో తెలుసా!

3 19హీరో రామ్‌, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బాక్సాఫీసు వద్ద మాయ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్లు రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా రామ్‌ తన దర్శకుడికి ట్వీట్‌ చేశారు. ‘ప్రియమైన పూరీ జగన్నాథ్‌ గారు.. సినిమా నచ్చితే పొగుడుతాం. నచ్చకపోతే తిడతాం. కానీ ఏంటండి.. మిమ్మల్ని మాత్రం బూతులతో పొగడాలని ఉంది. మీరు నాపై చూపిన ప్రేమకు థాంక్స్‌.. అది ఇప్పుడు స్క్రీన్‌పై కనపడుతోంది’ అని పోస్ట్‌ చేశారు. మరోపక్క ఈ సినిమాకు మంచి డిమాండ్‌ ఏర్పడిందంటూ ఛార్మి ఓ వీడియో షేర్‌ చేశారు. అందులో యువకులు టికెట్ల కోసం థియేటర్ వద్ద రచ్చ చేస్తూ కనిపించారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌లుగా నటించారు. పూరీ, ఛార్మి నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. సినిమా మాస్‌ను ఆకట్టుకునేలా ఉందని విమర్శకులు పేర్కొన్నారు. ‘హలో గురు ప్రేమ కోసమే’ తర్వాత రామ్‌ హీరోగా నటించిన సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu