Telugu heroes vs Tamil heroes:
ఒకవైపు తెలుగు హీరోస్ మాత్రమే కాక మరోవైపు తమిళ్ హీరోస్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే Telugu heroes కి తమిళ్ హీరోస్ కి మధ్య ఒక చాలా పెద్ద తేడా ఉంది.
ప్రభాస్ బాహుబలి సినిమా పుణ్యమా అని టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా కల్చర్ మొదలైంది. మొదట్లో బాగానే అనిపించినప్పటికీ.. ఇప్పుడు ఈ ట్రెండ్ చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయడం మొదలుపెట్టేసారు. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కాక డైరెక్టర్లు కూడా స్టార్ హీరోల కోసం అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే విధంగా కథలో రాయడం మొదలుపెట్టారు.
స్టార్ హీరోలు మాత్రమే కాక ఆఖరికి టైర్ 2, టైర్ 3 హీరోలు కూడా ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయడం మొదలు పెట్టేసారు. దీంతో కేవలం తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వచ్చే సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు. కానీ తమిళ్ హీరోలు అలా కాదు. కేవలం తమిళ్ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ఉంటారు.
ఆఖరికి తమిళ్ ప్రేక్షకులు కూడా మిగతా భాషల సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు. కేవలం తమిళ్ సినిమాల మీద మాత్రమే ప్రేమ చూపిస్తారు. పొన్నియిన్ సెల్వన్, కంగువా, తంగలాన్ వంటి తమిళ్ సినిమాలు కూడా ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్నాయి కానీ అవి తమిళ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. వాళ్లకి దగ్గరగా ఉండే కథలు మాత్రమే కానీ.. కావాలని ప్యాన్ ఇండియా రేంజ్ లో చేసిన సినిమాలు కాదు.
మిగతా భాషలో హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేస్తున్నా కూడా.. వాళ్ల భాషలో సినిమాలు చేయడం మానేయరు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి నిన్న మొన్న వచ్చిన హీరోల దాకా.. అందరూ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలకి బాగా అలవాటు పడిపోయి.. రూటేడ్ కథలు జోలికి వెళ్లడమే మానేశారు.
చూస్తూ ఉంటే తెలుగు సినిమాలు ఇంకా రావా అని సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలానే ప్యాన్ ఇండియా కల్చర్ ఇంకా ఎక్కువ అయిపోతూ పోతే.. తెలుగు సినిమాలు అని కాకుండా ప్యాన్ ఇండియా సినిమాలు అని పిలవడం మొదలవుతుందేమో. ఒకలిద్దరూ హీరోలు తమ మార్కెట్ కి తగ్గట్టుగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తే.. కనీసం మిగతా తెలుగు హీరోలైనా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం మొదలుపెడితే తప్ప ఇండస్ట్రీ నామరూపాలు మారిపోయే అవకాశం కూడా ఉంది.
ALSO READ: నిర్మాతని మార్చేసిన Nani.. కారణమేంటి?