Pushpa 2 cast:
ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ భారతీయ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు చేసిన ఫహద్, పుష్ప: ది రైజ్ లో ప్రధాన విలన్ గా కనిపించారు. కానీ పుష్ప 2 లో ఫహద్ పాత్ర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
తాజా సమాచారం ప్రకారం, ఫహద్ తన పాత్రపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘పుష్ప’ సిరీస్ తనకు ఏమీ చేయలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఫహద్, ఆ మాటలు అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చాయి. ‘పుష్ప 2: ది రూల్’ విడుదల తర్వాత ఆయన అన్న దాన్లో తప్పులేదు అని అందరికీ అర్ధం అయ్యింది.
𝐔/𝐀 it is!! #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/jPZuMaRK56
— Allu Arjun (@alluarjun) November 28, 2024
ఫహద్ పాత్రను సెకండ్ హాఫ్ లో కూడా సరైన ప్రాముఖ్యతతో తీర్చిదిద్దలేదని, ముఖ్యంగా ఆయన పాత్రని సరైన ముగింపు లేకుండా ఎండ్ చేశారు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఫహద్ తన సన్నిహితుల వద్ద ఈ అసంతృప్తిని వ్యక్తం చేశారట.
ఓ స్టార్ నటుడిగా, తనకు కేటాయించిన తేదీలు వృథా కావడం, కొన్ని రోజులు కెమెరా ముందుకు రాకుండానే గడపడం, ఆయనను ఆగ్రహానికి గురి చేశాయి. దీనివల్ల ఫహద్ ప్రస్తుతం కొత్త తెలుగు సినిమాలు సైన్ చేయాలని ఆసక్తి కూడా చూపడం లేదు.
ALSO READ: Mokshagna – Prashanth Varma సినిమా ఆఖరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం ఏంటి?