Mahesh Babu look in SSMB29:
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. జక్కన్న రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ మధ్యనే మహేష్ బాబు జైపూర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. గుబురు గడ్డంతో క్యాప్ పెట్టుకుని ఉన్న మహేష్ బాబు జుట్టుకి పోనీ టైల్ వేసుకున్నారు. మహేష్ బాబు ఇంత జుట్టు పెంచి చాలాకాలం అయిపోయింది. కాబట్టి ఇది రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ అని.. అందుకే ఇలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథను అందించారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు సౌత్ ఆఫ్రికా అడవుల్లోనే జరగబోతోంది. అయితే ఈ సినిమా కోసమే మహేష్ బాబు ఈ కొత్త లుక్ తో కనిపిస్తున్నారు అని తెలుస్తోంది. ఏదేమైనా ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా విభిన్నంగా ఉండటమే కాక ఆసక్తికరంగా కూడా ఉంది అని ఫాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు ముందే చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో మహేష్ బాబు ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.