Bigg Boss 8 Elimination:
Bigg Boss 8 మొదటి వారం పూర్తి కాబోతోంది. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో మొదటి నామినేషన్స్ చాలా గొడవలతో జరిగిన సంగతి తెలిసిందే. శేఖర్ బాషా, సోనియా, మనికంఠ, ప్రుథ్వి రాజ్, విష్ణుప్రియ భీమినేని, బేబక్క నామినేషన్‌లో ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ వారం ఎలిమినేషన్ దిశగా ఉన్న కంటెస్టంట్ విజయవాడకు చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ బేబక్క అని సమాచారం. ఆమె హౌస్‌లో అందరితో కలిసి బాగానే గొడవలు పడుతోంది కానీ ఓట్ల పరంగా మాత్రం వెనుకబడిపోతుంది అని టాక్. ఆమెను ఇంట్లో నుండి పంపేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే, బేబక్క మాత్రమే కాదు, సోనియా కూడా తక్కువ ఓట్లతో వెనుకబడి ఉంది. ఈ రెండు కంటెస్టంట్ లలో ఎవరైనా ఏ సమయంలోనైనా ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే, బిగ్ బాస్ మేకర్స్ ఎప్పుడు ఊహించని ట్విస్ట్ లు తెస్తారో కాబట్టి ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.
ఈ ఆదివారం నాడు నాగార్జున మొదటి ఎలిమినేషన్‌ను ప్రకటించే వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంతలో ఏ మార్పులు జరుగుతాయో, ఎవరు హౌస్‌లో నిలబడతారో చూడాలి. ఇక ఈ వారం ఎలిమినేషన్ తర్వాత చాలా మంది గేమ్ మొత్తం మారిపోయే పరిస్థితి ఉంది. మరి, ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపిస్తారో, ఎవరిని రక్షిస్తారో చూడాలి.