
Shah Rukh Khan in Sukumar Movie:
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ – బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. మిడ్‌డే ఇచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం, సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌కు కథా నేపథ్యాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన రూమర్ల ప్రకారం, షారుక్ ఖాన్ మాస్ అవతార్‌లో ఓ విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమా రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని, అందులో కుల వివక్ష, సామాజిక సమస్యలు లాంటి అంశాలు కూడా ప్రస్తావించబడతాయని తెలుస్తోంది.
ఇంతకుముందు సుకుమార్ – షారుక్ ఖాన్ కాంబోలో డార్క్ సైకాలాజికల్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా అప్‌డేట్ చూస్తే, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా మాస్, రస్టిక్ స్టోరీ దృష్టిలో పెట్టుకుని, షారుక్ ఖాన్‌ను కొత్త అవతార్‌లో చూపించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘కింగ్’, ‘టైగర్ వర్సెస్ పఠాన్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలాగే సుకుమార్ ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. వీరి ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్లు పడే అవకాశం ఉంది. దీంతో, ఈ నార్త్-సౌత్ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమయ్యే సూచనలు లేవు.
అయితే, ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. షారుక్ ఖాన్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయడం, సుకుమార్ స్టైల్‌లో ఓ మాస్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో కనిపించడం అంటే అదిరిపోయే కాంబినేషన్ అనే చెప్పాలి. అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.