
Sikandar Movie Update:
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ మార్చి 30న విడుదల కానుంది. ‘ఘజినీ’ ఫేమ్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాతో 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటివరకు పెద్దగా హైప్ లేదు. ముఖ్యంగా మేకర్స్ ఇప్పటివరకు సినిమా గురించి ఎటువంటి ఆసక్తికరమైన అప్డేట్ ఇవ్వలేదు.
ఇప్పటికే సినిమాపై అంచనాలు తక్కువగా ఉండగా, తాజా రీలీజ్ అప్‌డేట్ అభిమానులను మరింత టెన్షన్ పెడుతోంది. సినిమా ఆదివారం రిలీజ్ కావడం కలెక్షన్లపై నెగటివ్ ప్రభావం చూపనుంది. ‘టైగర్ 3’ కూడా ఆదివారం విడుదల కాగా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు ‘సికందర్’ కూడా అదే మిస్టేక్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా ప్రీ-ఈద్, ప్రీ-దీపావళి కాలంలో పెద్దగా వసూళ్లు ఉండవు. అందుకే సల్మాన్ ఆదివారం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ మేకర్స్ ఒక ప్రధానమైన అంశాన్ని మిస్ అయ్యారు. ఓ సినిమా మొదటి వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆదివారం రిలీజ్ అంటే ఆ రెండు రోజుల్లో లాభం పొందే అవకాశం కోల్పోతుంది.
‘టైగర్ 3’ కంటెంట్ పరంగా బలహీనంగా ఉండటంతో, ఆదివారం విడుదల వల్ల కలెక్షన్లు పడిపోయాయి. తుది గణాంకాల ప్రకారం, సినిమా రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అదే ఫ్రైడే లేదా థర్స్‌డే రిలీజ్ చేసుంటే, రూ. 350 కోట్ల దాకా వసూలయ్యేవి. ఇప్పుడు ‘సికందర్’ కూడా అదే దారిలో వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
ఈసారి ‘సికందర్’ కంటెంట్ బాగుంటే, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇక అసలు సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!
ALSO READ: Allu Arjun Trivikram సినిమా గురించి అదిరిపోయే అప్డేట్