Shankar downfall:
శంకర్ అంటేనే గ్రాండ్ సినిమాలు, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్, బ్లాక్‌బస్టర్ హిట్‌లకు బ్రాండ్. కానీ ఆఖరి రెండు సినిమాలు ‘2.0’, ‘ఇండియన్ 2’ తరువాత ఆయన కెరీర్ డౌన్‌గా వెళ్తోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజాగా ఓ పాపులర్ తమిళ యూట్యూబర్ ఓ ఆసక్తికరమైన కథనం షేర్ చేశాడు. ఆయన మాటల్లో, ఈ సమస్యలు 2.0 షూటింగ్ సమయంలోనే మొదలయ్యాయని, శంకర్ సోదరుడి కుమారుడు పప్పు కారణమని చెబుతున్నారు.
2.0 సినిమా షూటింగ్ సమయంలో ఒక రోజు రజనీకాంత్ సెట్‌కు ఆలస్యంగా వచ్చారు. అప్పట్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న పప్పు “ఎందుకు సార్, మీరు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు” అని ప్రశ్నించాడట. ఈ మాటలు రజనీకాంత్‌ను షాక్‌కు గురిచేశాయి. అప్పటి వరకు అంతటి పెద్ద స్టార్‌గా ఉండి ఎవరూ తనను అవమానించలేదని, ఆ రోజు తన మేకప్ ఆర్టిస్ట్‌కు పంచుకున్నారని సమాచారం.
ఈ సంఘటన తర్వాత శంకర్ సినిమాలు నిరాశ పరిచాయని, ఇది కర్మ ఫలితమని ఆ యూట్యూబర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ ప్రాజెక్టులు అడ్డంకులు ఎదుర్కొని కొద్ది రోజులు నిలిచిపోయాయని చెబుతున్నాడు. నిర్మాతలు నష్టపోయిన తీరు కూడా శంకర్‌పై ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు.
ఇది కేవలం కర్మనా లేక తాత్కాలిక సమస్యలేనా అనేది క్లారిటీగా చెప్పలేం. కానీ శంకర్ ప్రస్తుత పరిస్థితి చూసి అతని ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు.