
NTR31 Story:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ.. చిత్ర బృందం సినిమాని ఒక పూజా కార్యక్రమంతో హైదరాబాద్ లో అధికారికంగా లాంచ్ చేసింది.
అంతేకాకుండా ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్లో సినిమాకి సంబంధించిన చాలా డీటెయిల్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కథ ఎలా ఉండబోతోంది అని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆ పోస్టర్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ మ్యాప్ లో ఒకవైపు చైనా భూటాన్ దేశాల పేర్లు ఉన్నాయి దాని కింద 1969 అని రాసి ఉంది. ఆపోజిట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే సినిమా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.
1969 లో చైనా, భూటాన్, సిక్కిం మధ్య నల్లమందు వనరులు పుష్కలంగా వుండేవి. ఈ కథనే ఈ సినిమాలో చూపిస్తారా అని ప్రశ్నలు మొదలు అయ్యాయి. గోల్డెన్ ట్రయాంగిల్ లో మూడు దేశాలు ఉంటాయి. ఒకటి ఈశాన్య మయన్మార్ (బర్మా), మరొకటి నార్త్ వెస్ట్ థాయిలాండ్, ఇంకోటి నార్త్ లావోస్. అది ఒక పెద్ద పర్వత ప్రాంతం. 1950లో నుండి ప్రపంచంలోని అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే దీన్ని డ్రగ్ క్యాపిటల్ గా పిలుస్తారు. గోల్డెన్ ట్రయాంగిల్‌లో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించేది ఖున్ సా కుమింటాంగ్ అనే ఒక పెద్ద డ్రగ్ లార్డ్. అయితే 1969లో ఖున్ సాను అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఈ కథ ఆధారంగానే ఎన్టీఆర్-నీల్ చిత్రం ఉంటుంది అని అంటున్నారు.