HomeTelugu Big StoriesDevara విషయంలో ఆ తప్పు దిద్దుకోనున్న కొరటాల శివ

Devara విషయంలో ఆ తప్పు దిద్దుకోనున్న కొరటాల శివ

Is Koratala Siva fixing Janatha Garage flaws with Devara?
Is Koratala Siva fixing Janatha Garage flaws with Devara?

Devara premieres:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా Devara. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఎర్లీ మిడ్ నైట్ షో పడనుంది. అమెరికాలో మొదటి షో తో పాటు ఇండియాలో కూడా ఎర్లీ మిడ్ నైట్ షో పడుతుంది. అయితే కొరటాల శివ ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా.. కమర్షియల్ గా సక్సెస్ అయితే అయింది కానీ.. సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దానికి కారణం ఇండియాలో సినిమా విడుదలయ్యే ముందే సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం. ఆ విషయంలో ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు.

జనతా గ్యారేజ్ విషయంలో జరిగిన తప్పు ఇప్పుడు దేవర విషయంలో జరగకూడదని కొరటాల.. ఈ నిర్ణయం తీసుకున్నారు అని.. అందుకే రెండు చోట్ల ఒకే సమయంలో వస్తున్న పడాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో అర్ధరాత్రి 1:08 కి దేవర సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి.

రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదలవుతుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu