టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం గురించి ప్రేక్షకుల్లో ఎంతగానో ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొన్న కాజల్ తాను త్వరలో వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ.. అతను కచ్చితంగా దైవభక్తి కలవాడై ఉండాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమకు చెందిన వారిని తాను పెళ్లి చేసుకోనని ఆమె పేర్కొన్నారు. తాను ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, కాకపోతే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్ల తనతో విడిపోయానని కాజల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె తల్లిదండ్రులకు ఓ బిజినెస్ మ్యాన్ సంబంధం నచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, ప్రియా భవానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ భోపాల్‌లో జరిగింది. అక్కడ 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఓ ఫైట్ సీన్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్వాలియర్‌లో జరుగుతుంది.