
Jio Hotstar streaming quality:
Jio Hotstar యూజర్లు ఇటీవల స్ట్రీమింగ్ క్వాలిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం ప్యాకేజీకి ₹1,499 చెల్లించినప్పటికీ, 4K UHD లేదా Dolby Atmos లాంటి హై-ఎండ్ ఫీచర్లు అందడం లేదు. ఈ సమస్యపై ఎక్కువగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా Twitterలో వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ యూజర్లకు 1080p రెసొల్యూషన్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇతర దేశాల్లో మాత్రం అదే కంటెంట్ 4K UHD, Dolby Vision, Dolby Atmos లాంటి అధిక నాణ్యతతో అందుతోంది. అంతేకాకుండా, యాప్ వినియోగదారులకు 25 FPS మాత్రమే లభిస్తుండగా, Jio Set-Top Box(STB) వినియోగదారులకు 50 FPS అందుతోంది. దీనివల్ల, Hotstar యాప్ వినియోగదారులకు అన్యాయం జరుగుతోందని చాలా మంది ఆరోపిస్తున్నారు.
ఇంతకు ముందు, Hotstarలో HBO కంటెంట్ స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు, మంచి వీడియో, ఆడియో క్వాలిటీ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు Jio Hotstar సరైన హై-రెజల్యూషన్ మరియు అడ్వాన్స్‌డ్ ఆడియో ఫార్మాట్ హక్కులు పొందలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వినియోగదారులు మంచి క్వాలిటీ కోసం మార్గం లేకపోవడంతో పైరసీ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ క్రమంలో Prime Video భారత మార్కెట్‌లో ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతోంది. అన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు 4Kలో అందుబాటులో లేకపోయినా, ఎక్కువ శాతం 4K HDR కంటెంట్ మరియు 5.1 Surround Sound లభిస్తోంది. ఈ కారణంగా, చాలా మంది వినియోగదారులు Prime Video వైపు మారుతున్నారు.
Jio Hotstar ఈ సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, వీటిని పరిష్కరించకపోతే, భారతీయ OTT మార్కెట్‌లో తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
ALSO READ: The Wild Robot తెలుగులో ఏ ఓటిటి లో చూడచ్చంటే