అమ్మఒడితో కొంత ఇచ్చి.. నాన్నబుడ్డితో మొత్తం కొట్టేస్తున్న జగన్ రెడ్డి ?

ప్రశ్నపత్రాలను కాజేసిన గతం జగన్ రెడ్డిది. అసలు చదువు పై జగన్ రెడ్డికి ఆసక్తే లేదు. అందుకేనేమో జగన్ రెడ్డికి విద్య పైన, విద్యార్థుల పైన చెప్పలేనంత కోపం. తన ముందు ఆంగ్లంలో ఎవరు గొప్పగా మాట్లాడినా జగన్ రెడ్డి ఓర్చుకోలేరు అనేది ఆయన దగ్గర పనిచేసిన అధికారులే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ గుసగుసలు నిజమేమో అనిపిస్తోంది. చంద్రబాబు గారు కిలోమీటర్ కు ఒక పాఠశాల, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూల్ ఉండేలా చేసి, విద్యార్థుల ముంగిటకే విద్యను తీసుకెళ్లారు. మరి జగన్ రెడ్డి ఏం చేశాడు ?, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నూతన విద్యా విధానం పేరుతో విద్యను విద్యార్థులకు దూరం చేశాడు. 11 వేల ప్రభుత్వ పాఠశాలలు జగన్ నూతన విద్యావిధానంతో మూతపడ్డాయి.

కొఠారి కమిషన్ ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్ని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి, ఒకే విద్యా విధానం అమలు చేయాలని చెబితే, జగన్ దాన్ని తనకు అప్పులు పుట్టేలా కొత్తగా మార్చుకున్నాడు. ఇలా చేసిన ఏకైక ముఖ్య మంత్రి మన మూడు ముక్కల రెడ్డి మాత్రమే. మొత్తానికి పిల్లల్ని పాఠశాలలకు దూరం చేసి, ఊరి బయట ఉండే ఒకే ఒక పాఠశాలకు పరిమితం చేశాడు. పాఠశాలల విలీనం పేరుతో జగన్ రెడ్డి, బడుగు బలహీన వర్గాలు, దళితుల పిల్లలకు విద్యను దూరం చేశాడు. జగన్ నిర్వాకంతో 3.50 లక్షల డ్రాపౌట్స్ పెరిగాయి. జగన్ రెడ్డి నూతన విద్యా విధానం విద్యార్థులకు శాపంగా మారిందనే చెప్పాలి. ఇక అమ్మఒడి పేరుతో ఇస్తున్న దానికంటే నాన్న బుడ్డితో కొట్టేస్తున్నదే ఎక్కువ. అన్న వస్తాడు.. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తాడని, మీ బిడ్డలకు మేనమామ అవుతాడని జగన్ భార్య భారతి రెడ్డి డబ్బాలు కొట్టింది.

అన్న వచ్చాక ఇస్తున్న అమ్మఒడి కంటే నాన్నబుడ్డి రూపంలో కొట్టేస్తున్నదే ఎక్కువైంది. మరి భారతి రెడ్డి నాన్నబుడ్డిల గురించి ఏం చెబుతుంది ?, దీనికితోడు 80 లక్షల మంది విద్యార్థులుంటే, అమ్మ ఒడిని కేవలం 40 లక్షల మందికే పరిమితం చేశాడు జగన్ రెడ్డి. అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు ఇస్తానని చెప్పిన జగన్, దాన్ని రూ.14 వేలకు కుదించాడు. ఆ తర్వాత మెయింటెనెన్స్ పేరుతో రూ.13 వేలకే పరిమితం చేశాడు. దళితులకు నాణ్యమైన, ఉన్నత విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను రద్దు చేశాడు, విదేశీ విద్య, అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను మూసేశాడు. దళిత విద్యార్థులు, యువకులు జ్ఞానవంతులైతే, తనను ప్రశ్నిస్తారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి వారిని ఉన్నత విద్యకు దూరం చేశాడు.

గత ఏడాది పదో తరగతి ఫలితాలు 64.02 శాతానికి పరిమితం అవ్వడమేనా జగన్ రెడ్డి అమలు చేసిన నూతన విద్యా విధానం ?, పదోతరగతి ఫలితాలు ఆ స్థాయిలో పడిపోవడానికి జగన్ రెడ్డి ఉపాధ్యాయులపై సాధిస్తున్న కక్ష సాధింపులే నిదర్శనం. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు తలొగ్గి, 50 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను పక్కన పెట్టాడు జగన్ రెడ్డి. విద్యావ్యవస్థ నాశనమైతే దాన్ని బాగు చేయడం ఎవరి తరం కాదనే వాస్తవాన్ని జగన్ రెడ్డికి అర్ధం అయ్యేలా చెప్పేదెవరు ?, ఎవరు చెప్పినా ఆ మోనార్కుడు వింటాడా ?, నీచపు బుద్దిలో మాస్టర్స్ చేసిన జగన్ రెడ్డి మనసు మారుతుందా ?, జగన్ పాలనలో కే.జీ నుంచి పీ.జీ వరకు చదివే విద్యార్థుల పరిస్థితి, జిల్లా పరిషత్, గవర్నమెంట్, ఎయిడెడ్ టీచర్ల పరిస్థితి హృదయవిదారకంగా మారిందనేది నిజం.

ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జగన్ రెడ్డి మళ్లీ సీఎం అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చూసి జాలి పడాలి. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి జాలి పడుతున్నారు. కరెంట్, రోడ్లు కూడా లేని ఆంధ్ర ప్రజలను చూసి కొందరు నవ్వుకుంటున్నారు. గొప్ప తెలివితేటలు ఉన్న జనం ఆంధ్ర జనం అని ఒకప్పుడు పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరు అబద్ధం అయిపోయింది. ఒక్క జగన్ రెడ్డి వల్ల ఆంధ్ర ప్రజలు చిన్నబోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu