HomeTelugu Trendingఅతను ఎవరు.. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడా? 

అతను ఎవరు.. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రియుడా? 

3 23

‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రేమలో పడ్డారా? పై ఫొటోలో ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆమె ప్రియుడా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో చూసి నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే ఎలాంటి క్యాప్షన్‌ ఇవ్వకుండా ఏదో కోడ్‌ భాషలా నాలుగు గీతలను జత చేశారు. దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అదీకాకుండా కామెంట్స్‌ ఎక్కువగా కనిపించకుండా పాయల్‌ కొన్ని బ్లాక్‌ చేసేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్‌ చెప్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ప్రస్తుతం ఆమె ‘వెంకీ మామ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె వెంకటేష్‌కి జోడీగా నటిస్తున్నారు. దీంతో పాటు ‘ఆర్‌డీఎక్స్‌’, రవితేజకు జోడీగా ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటిస్తున్నారు.

View this post on Instagram

🖤💟🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu