HomeTelugu TrendingHarish Shankar దర్శకత్వంలో చిరంజీవి.. నిజమేనా?

Harish Shankar దర్శకత్వంలో చిరంజీవి.. నిజమేనా?

Harish Shankar దర్శకత్వంలో చిరంజీవి.. నిజమేనా?
Harish Shankar దర్శకత్వంలో చిరంజీవి.. నిజమేనా?

తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి షూటింగ్ చేస్తున్నారు అని. అంటే వీళ్ళిద్దరి కాంబోలో సినిమానా అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజం ఎంత?

Harish Shankar – Chiranjeevi:

ఇండస్ట్రీలో ఉన్న పేరు మోసిన డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఈ మధ్యన ఫామ్ లో లేరన్న సంగతి తెలిసిందే. గడ్డలకొండ గణేష్ తో ఫ్లాప్ అందుకున్న హరీష్ శంకర్.. ఈ మధ్య నే రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో కూడా మరొక డిజాస్టర్ అందుకున్నారు.

ఇక ఇప్పటికైనా హరీష్ శంకర్ రీమిక్స్ సినిమాలో మానేసి మామూలు కథలు తీస్తే బాగుంటుంది అని ఫాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి షూటింగ్ చేస్తున్నారు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మెగా హీరోలతో హరీష్ శంకర్ కి మంచి స్నేహం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ వంటి హీరోలతో హరీష్ శంకర్ సినిమాలు చేశారు. త్వరలో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. దీంతో చిరంజీవితో కూడా హరీష్ శంకర్ ఏదైనా సినిమా ప్లాన్ చేశారా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

వివరాల్లోకి వెళితే హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి షూటింగ్ చేసిన విషయం వాస్తవమే. సారథి స్టూడియోస్ లో ఈ షూటింగ్ జరిగింది. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం వీళ్లిద్దరూ కలిసి పనిచేసినట్టు తెలుస్తోంది. ఆ యాడ్ దేనికోసం అనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక నిజంగానే హరీష్ శంకర్ చిరంజీవి కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu