
Allu Arjun Atlee movie:
‘జవాన్’తో 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన అట్లీ ఇప్పుడు దేశంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచాడు. షారుఖ్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, అతని తదుపరి చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదట సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయాలని అట్లీ ప్లాన్ చేసాడు. కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యింది. ఇప్పుడు, అతని దృష్టి అల్లుఅర్జున్ పై ఉంది. పుష్ప 2 తరువాత అల్లుఅర్జున్ మార్కెట్ భారీగా పెరిగింది. అట్లీ – అల్లుఅర్జున్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ, ఇక్కడ పెద్ద సమస్య ఒకటి ఉంది!
రిపోర్ట్స్ ప్రకారం, అట్లీ తన రీమ్యూనరేషన్‌గా రూ. 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు! సాధారణంగా, ఇంత భారీ రెమ్యునరేషన్ హీరోలు మాత్రమే తీసుకుంటారు. ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద షాక్ ఇచ్చింది.
ఇదే సమయంలో అల్లుఅర్జున్ కూడా తన రెమ్యునరేషన్ పెంచుకున్నాడు, దీంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. దక్షిణాది నిర్మాణ సంస్థలు మొదట ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపినా, ఇప్పుడు అత్యధిక ఖర్చుల కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
అట్లీ తన టాలెంట్‌కి తగినంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని నమ్ముతున్నాడు. అయితే, OTT & టీవీ రైట్స్ ధరలు తగ్గిపోవడంతో, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టాలా? లేదా? అనే డైలెమాలో ఉన్నారు.
ఇక ఫైనల్‌గా, అట్లీ-అల్లుఅర్జున్ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా? లేక ప్రొడ్యూసర్స్ వెనుకడుగు వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది!
ALSO READ: February Box Office టాలీవుడ్‌కి మామూలు షాకులు ఇవ్వలేదుగా