HomeTelugu Big Stories'7/g బృందావన కాలనీ' బ్యూటీ పెళ్లంట!

‘7/g బృందావన కాలనీ’ బ్యూటీ పెళ్లంట!

Is sonia Agarwal getting ma

టాలీవుడ్‌లో 7/G సినిమా లో నటించిన హీరోయిన్‌ సోనియా అగర్వాల్ పెళ్లికి సిద్ధమౌతున్నట్లు వార్త ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 7/జి బృందావన కాలనీ` సినిమాతో ఈ అమ్మడికి ఇక్కడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్ తో ప్రేమాయణం పెళ్లిపై వాడి వేడిగా చర్చ సాగింది. ఈ జంట నాలుగేళ్ల కాపురంలో కలతలు చెలరేగడంతో సోనియా అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సెల్వరాఘవన్ తన అసిస్టెంట్ అయిన గీతాంజలిని పెళ్లాడాడు. ఆ జంటకు పిల్లలు ఉన్నారు.

దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్నట్లు హింట్ ఇచ్చింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటో చూసిన వారికి ఉన్నట్టుండి సైలెంట్ గా షాకింగ్ వార్త చెబుతోందే! అంటూ కంగారు పడ్డారు. సోనియా పెళ్లి వీడియోలు ట్వీటర్‌లో వైరల్ అవుతున్నాయి. ‘ఇది తెలియాలంటే మరో మూడు రోజులు వేచి ఉండండి’ అన్న కామెంట్‌ తో సోనియా తన పెళ్లి కూతురు గురించి హింట్ ఇస్తోందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు పలు విధలుగా స్పందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu