Pushpa 2 music director change:
పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్పీ)కి చోటు లేకపోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. ఇది పెద్ద అవమానంగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డిఎస్పీ, చిత్ర దర్శకుడు సుకుమార్ మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతీ సినిమాలో దేవి ప్రత్యేక సంగీతాన్ని అందించారు.
కానీ, ఈసారి ‘పుష్ప 2’లో డిఎస్పీని తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం సుకుమార్ తీసుకున్నది కాదని టాక్ నడుస్తోంది. హీరో అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పుష్ప 2 మొదటి భాగం పూర్తైన తర్వాత బన్నీ సంగీత బాధ్యతలను డిఎస్పీకి అప్పగించారు. అయితే, డిఎస్పీ తన స్టేజ్ షోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో సినిమాపై ఆయన దృష్టి తగ్గిందని తెలుస్తోంది.
#EXCLUSIVE : SUDDEN CHANGE – DSP TO BE REPLACED IN PUSHPA 2 ✅
There is a Sudden Change in Background Music Composer in Pushpa 2 ✅
THAMAN LIKELY TO JOIN ✅#Pushpa2ThaRule #AlluArjun pic.twitter.com/I5L8L0Tk4l
— DARK HOOD 𝕏 (@ithedarkhood7) November 6, 2024
ఈ నిర్లక్ష్యం చూసి బన్నీకి కోపం వచ్చిందట. ఇదే సమయంలో బన్నీకి సన్నిహితంగా ఉన్న ఒక దర్శకుడు ఈ విషయంపై మరింత చెదలు పెట్టారని సమాచారం. ఆయన, డిఎస్పీ కి తన స్టేజ్ షోలు అల్లు అర్జున్ లాంటి స్టార్ సినిమా కంటే ఎక్కువా అని బన్నీని అడిగారట. దీనితో బన్నీ ఆ మాటలను సీరియస్‌గా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి.
ఫలితంగా, సంగీత బాధ్యతలను మరో ముగ్గురు సంగీత దర్శకులకు అప్పగించారు. సుకుమార్ కూడా ఈ సందర్భంలో డిఎస్పీకి మద్దతు ఇవ్వలేకపోయారు. ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని, చాలా కాలంగా ఈ సమస్య కొనసాగుతోందని సమాచారం. డిఎస్పీ, సుకుమార్‌తో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ప్రయత్నించినా, సుకుమార్ పెద్దగా స్పందించకపోవడంతో డిఎస్పీ నిరాశతో వెనుదిరిగినట్టు సమాచారం.
ఏదేమైనా బన్నీ నిర్ణయం సినిమా రిజల్ట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయం ఇంకా చూడాల్సి ఉంది.
ALSO READ: సైలెంట్ గా రిలీజ్ అయిన Apudo Ipudo Epudo సినిమా ఎలా ఉందంటే!