ప్రముఖ నటి నయనతార-డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలసిందే. వీరికి తమిళనాడు సర్కారు గురువారం షాకిచ్చింది. పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకుండానే నయన్ కవల పిల్లలకు ఎలా జన్మనిచ్చారన్న వాదనలు రేకెత్తగా… సరోగసీ (అద్దె గర్భం) ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారన్న వాదనలు వినిపించాయి.
అయితే సోషల్ మీడియాలో వివాదం జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్పందించారు. ఈ విషయంపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, తమిళనాడు సర్కారు తాజాగా నయన్ సరోగసీ వివాదంపై ఏకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడంపై నిషేధాన్ని విధించింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే సరోగసీకి వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుంది.