HomeTelugu News'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' టీజర్‌ రిలీజ్‌!

‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ టీజర్‌ రిలీజ్‌!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశాం. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న మరో సూపర్‌హిట్‌ సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”మంచి కథ, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. అల్లరి నరేష్‌కి, నాకు ఈ సినిమా మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ తర్వాత నరేష్‌ కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu