HomeTelugu Big StoriesPrabhas Next Movie: నెలలో ప్రభాస్ సినిమా.. ఎవరితోనో తెలుసా?

Prabhas Next Movie: నెలలో ప్రభాస్ సినిమా.. ఎవరితోనో తెలుసా?

 

Interesting update about Prabhas Next Movie
Interesting update about Prabhas Next Movie

Prabhas Next Movie:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుసగా కొన్ని డిజాస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. కానీ అవన్నీ దాటుకుని ప్రభాస్ మళ్ళీ వరుస విజయాలను అందుకుంటున్నారు. సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. కల్కి సినిమాతో మరొక కెరియర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. విడుదలై వారాలు గడుస్తున్నా కూడా.. కల్కి సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది.

అయితే ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అందులో ప్రభాస్ నెక్స్ట్ ఏ సినిమాని మొదలు పెట్టబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సలార్ కి ముందు వరకు ప్రభాస్ ఏ సినిమా చేసిన పర్వాలేదు కానీ హిట్ అయితే చాలు అని అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి.

వరుసగా రెండో సూపర్ హిట్లు వచ్చాయి. పైగా కల్కి 2898 AD రేంజ్ కలెక్షన్లు వచ్చాక ప్రభాస్ తదుపరి సినిమాల విషయంలో కూడా ప్రెషర్ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో క్యామియో కనిపించనున్నారు. కానీ ఆ సినిమా మీద ప్రేక్షకులకి అంతగా అంచనాలు లేవు. ప్రభాస్ కోసం అభిమానులు సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా హిట్ అయ్యే అవకాశాలు మాత్రం అంతగా లేవనే చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆల్రెడీ ఉన్న సినిమాల్లో మంచి సినిమా ఎంచుకొని షూటింగ్ మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమా మీద అంత అంచనాలు లేవు.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరొక నెల రోజుల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మూడు నెలల తర్వాత మొదలు కావాలి. కానీ ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ ని ప్రీ పోన్ చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu