HomeTelugu Big StoriesNani Next Movie: నాని హిట్ 3 కి ఏంటి లేటు?

Nani Next Movie: నాని హిట్ 3 కి ఏంటి లేటు?

Nani
Interesting update about Nani hit 3

Nani in Hit 3: నాచురల్ స్టార్ నాని గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. అదే జోరుతో నాని సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా నాని బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఈ మధ్యనే హోల్డ్ లోకి వెళ్లిపోయింది.

అయితే ఒక రెండేళ్లు వెనక్కి వెళితే 2022లో హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్: ది సెకండ్ కేస్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా కనిపించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించింది. శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగులో హిట్ ఫ్రాంచైజీ బాగా హిట్ అయింది.

ఇక ఈ ఫ్రాంచైజీ లో మూడవ భాగంగా హిట్ 3 సినిమా లో.. నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తారు అని.. హిట్ 2 లోనే రివిల్ చేసేసారు. అప్పట్నుంచి హిట్ 3 సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కట్ చేస్తే సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రావడం లేదు.

హిట్ సినిమా తర్వాత శైలేష్ కొలను వెంకటేష్ హీరోగా సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇప్పుడు హిట్ 3 సినిమాకి స్క్రిప్ట్ రెడీగా ఉంది. శైలేష్ కూడా రెడీ గానే ఉన్నారు. మరోవైపు నాని కోసం దసరా డైరెక్టర్ కూడా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు.

అయితే నాని మాత్రం ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో వెకేషన్ లో ఉన్నారు. అక్కడినుంచి తిరిగి వచ్చాక నాని దసరా డైరెక్టర్ స్క్రిప్ట్ కూడా ఎంతవరకు వచ్చిందో చూసి.. దాన్ని బట్టి ఎవరితో సినిమాని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంటారట.

More about Nani Saripodaa Sanivaram:

గతంలో నాని అంటే సుందరానికి సినిమాకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా కూడా తీస్తున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నానితో రొమాన్స్ చేసిన ప్రియాంక అరుల్ మోహన్.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కి సిద్ధం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu