
Allu Arjun Trivikram movie update:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ఇప్పుడు బన్నీ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్. దీంతో ఈ కొత్త మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ పనుల్లో ఉన్నాడట. ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో ఉండబోతుందని, అందుకే ఇందులో కీలకమైన పాత్రలకు టాప్ యాక్టర్స్‌ను తీసుకోవాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఎప్పుడూ స్టార్ క్యాస్టింగ్ హైలైట్ గా ఉంటుంది. గతంలో మోహన్‌లాల్, ఉపేంద్ర లాంటి స్టార్ యాక్టర్స్‌ను తీసుకొచ్చిన ఆయన, ఈసారి ఎవరి పేర్లు ఫైనల్ చేస్తాడో చూడాలి. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు జోడీగా ఎవరు నటిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో త్రివిక్రమ్ తన మార్క్ మాజిక్ చూపిస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి, ఈ భారీ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడాలి.