HomeTelugu TrendingThandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య

Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య

Interesting twist in Thandel release date
Interesting twist in Thandel release date

Thandel Release Date:

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం తండెల్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. గీతా ఆర్ట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చందూ మొండేటితో చైతన్యకు మూడో సినిమా.

మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే, రామ్ చరణ్ గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 వంటి పెద్ద సినిమాలు కూడా క్రిస్మస్ సమయంలో విడుదల కావడంతో తండేల్ విడుదల వాయిదా పడింది. రెండు భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాలు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలతో పోటీ లేకుండా ఈ సినిమా తప్పుకుంది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తండేల్ సంక్రాంతి విడుదల లేదా వేసవి రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సంక్రాంతి సమయంలో మరిన్ని పెద్ద సినిమాలు వస్తున్నప్పటికీ, నిర్మాతలు జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

అదే సమయంలో, సీనియర్ హీరో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర జనవరి 10న విడుదల కాబోతోంది. అంతే కాకుండా సంక్రాంతి సమయంలో వెంకటేశ్, బాలకృష్ణ తదితరుల సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తండేల్ టీమ్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్నా కూడా.. కచ్చితంగా హిట్ అవుతుంది అని.. కంటెంట్ మీద నమ్మకంతో చిత్ర దర్శక నిర్మాతలు ముందుకు వెళుతున్నారు. విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu