దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ చాలా బాగా కలిసొస్తుంది. సంక్రాంతి సీజన్లో రిలీజైన అనిల్ రావిపూడి మూవీస్ సూపర్ హిట్ అవుతాయని అతడికి బాగా నమ్మకం. ఈ కోవలోనే సంక్రాంతికి రిలీజై F2, సరిలేరు నీకెవ్వరు అత్యంత భారీ విజయం అందుకున్నాయి.
అలాగే వెంకటేష్‌కి కూడా ఈ సెంటిమెంట్ ఉంది. గతంలో సంక్రాంతికి రిలీజైన చిత్రాలు వెంకటేష్‌కు మంచి హిట్స్‌ను అందించాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఈ సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ నిర్ణయించారు. అనిల్ రావిపూడి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు.
ఇంట్రెస్టింగ్ టైటిల్ వారి పండుగ సెంటిమెంట్‌ను మాత్రమే కాకుండా, సినిమా కథను కూడా సూచిస్తుంది. ఈ చిత్రం కూడా జనవరి 12, 2025న అంటే సంక్రాంతి సెలవుల సీజన్లో విడుదల కానుంది. ఫైనల్ స్క్రిప్టింగ్ జరుగుతోంది. దిల్‌రాజు, శిరీష్ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనున్నారు.