పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించాడు. ఇంకా ఎక్కువ మొత్తం తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ ప్రముఖ నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వినోదయ సీతం రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఈసినిమాలో పవన్ దేవుడుగా కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు ‘దేవుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. ముందుగా ఈ సినిమాకి దేవర అనే టైటిల్ అనుకున్నారంట. అయితే దేవర టైటిల్‌ని బండ్ల గణేష్ ఇప్పటికే రిజిస్టర్ చేయించాడు.
దీంతో దేవర కాస్త దేవుడు టైటిల్ కి ఫిక్స్ అయ్యారట. ఇంకో వార్త ఏమిటంటే.. ఈ సినిమాలో కేవలం సాయి ధరమ్ తేజ్‌కి మాత్రమే హీరోయిన్ ఉంది. మరో ఆసక్తికర వార్త ఏటంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్‌కు ఐటమ్ సాంగ్ ఉందంట. ఈ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ నర్తించనున్నట్లు టాక్. దీంతో నెటిజన్లు.. ఒరిజనల్ మూవీలో ఒక్క సాంగ్ కూడా లేదు.
మరీ ఈసినిమాలో ఐటమ్ సాంగ్ ఎలా పెడతారు అని అంటున్నారు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా చేస్తున్నారు. అయినా దేవుడికి మనిషికి పాటలు ఏమిటి. పవన్ ఇలాంటి పాటలకు ఒప్పకుంటాడా.. అంటూ త్రివిక్రమ్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవార్తలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు